Wednesday, 2 June 2021

సూర్యుని చుట్టూ భారీ వలయ కారం

ఆకాశంలో అద్భుతం జరిగింది. 
సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు ఆకారంలో వలయం ఏర్పడింది. పట్టపగలు మండుతున్న ఎండలో సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు రంగుల్లో ఏర్పడ్డ వలయం అందరినీ ఆకర్షిస్తోంది. వర్షం కురిసిన తర్వాత సూర్యుడి చుట్టూ ఉన్న నీటి బిందువులపై సూర్యకాంతి పరావర్తనం చెందినప్పుడు ఇలాంటి వలయాలు ఏర్పడుతుంటాయి. ఆకాశం నిర్మలంగా ఉండటంతో ఈవలయం మరింత స్పష్టంగా కనిపించింది.. ఈ దృశ్యం ఉ.11 గంటల నుంచి మ.12 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.. సుమారు గంట పాటు కనివిందు చేసింది..
Fact: సూర్యుని చుట్టూ భారీ వలయ కారం ఈరోజు ఆకాశంలో మధ్యాహ్నం ఒక వింత చోటుచేసుకుంది. సూర్యుని చుట్టూ ఒక వృత్తాకారంలో ఏర్పడింది దీన్ని పూర్వీకులు వరద గూడు అని పిలిచేవారు. గత పౌర్ణమి రోజు చంద్రుని చుట్టూ కూడా ఇలాంటి వరద గూడు ఏర్పడింది. పూర్వం పెద్ద మనుషులు ఈ వరద గూడుని చూసే రానున్న కొద్దిరోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావించేవారు. ఈసారి ఇలా కనిపించడానికి ముఖ్య కారణం గత సంవత్సరం నుండి పలుమార్లు లాక్ డౌన్ విధించడం వల్ల వాయు కాలుష్యం తగ్గి వాతావరణంలో పెనుమార్పులు రావడం వల్ల ఇలాంటి దృశ్యం కనిపించిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీనిని పరివేశం అని పిలుస్తారుట... పూర్వం మన పూర్వీకులు... జ్యోతిష్య శాస్త్ర పండితులు... ఈ పరివేశపు రంగు పరిమాణమును బట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో పసిగట్టి తగు జాగ్రత్తలు చెప్తారట... ఈ పరివేశం... రాబోయే కాలంలో మంచి వర్షాలు పడుతాయని.. ఇది శుభ సూచకమనీ చెప్తున్నారు... 
so భయపడవలసిన అవసరం లేదు... 

Tags:
పరివేశం
holosion and its significance in astrology


Post a Comment

Whatsapp Button works on Mobile Device only