Tuesday, 11 October 2022

Improve Platelets - REmedies for Dengue in telugu - best health tips in telugu ammamma chitkalu - డెంగ్యూ fever remedies

ప్లేట్ లెట్ కౌంట్ అంటే ఏమిటి... అవి ఎలా పెంచుకోవాలి
ప్లేట్ లెట్ కౌంట్ - ఎర్ర రక్త కణాలు - తెల్ల రక్త కణాలు
Platelet count- white blood cells - Red blood cells information in telugu  
మనలో చాలా మందికి రక్తం అంటే మాత్రమే తెలుసు.. కానీ రక్తం 3 పార్ట్ లుగా విడిపోయి ఉంటుంది.. అందుకే రక్తం ఎక్కించినా ...ఇచ్చినా.. మూడు విధాలుగా తీసుకుంటున్నారు..
రక్తం లోని పార్ట్స్... ఎర్ర రక్త కణాలు - తెల్ల రక్త కణాలు - ప్లేట్ లెట్స్..
Functions of Red blood cells in Telugu
ఎర్ర రక్త కణాలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది...
తెల్ల రక్త కణాలు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది... తెల్ల రక్త కణాలు తక్కువ ఉంటే.. ఎక్కువగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు...
ఇక ప్లేట్ లెట్స్...
ఈ రోజుల్లో డెంగ్యూ జ్వరం వలన ఈ ప్లేట్ లెట్స్ పేరు బాగా ప్రముఖం అయింది... ఇవి సాధారణ మనిషికి 1.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటాయి... ఒకరకంగా ఈ ప్లేట్ లెట్ అంటే ఎర్రరక్త / తెల్ల రక్త కణాలను పట్టి ఉంచే జల్లెడ లాంటి పదార్థం అనుకోవచ్చు... ఇవి తగ్గితే రక్తాన్ని పట్టి ఉంచే శక్తి తగ్గి.. తద్వారా శరీరంలో ఆక్సిజన్ ను సరఫరా చేసే శక్తి తగ్గుతుంది అన్నమాట.. అందుకే డెంగ్యూ జ్వరం చాలా ప్రాణాంతకం అయ్యేది...

ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి బొప్పాయి ఆకుల రసం ఎంతో ఉపయోగం... 20,000 ప్లేట్ లెట్ లు ఉంటే చాలా వరకు ప్రమాద స్థాయిలో ఉన్నట్లే.. అయినప్పటికీ అలాంటి స్థితి నుండి 2,50,000 ప్లేట్ లెట్ లు రావడానికి కేవలం 4 గంటల సమయంలోపులే ఈ బొప్పాయి ఆకుల రసం ఇచ్చింది అంటే అర్థం చేసుకోండి.. అది ఎంత మంచి విషయమో... డెంగ్యూ కు ఎన్నో మందులు.. పండ్లు.. ఉండవచ్చు.. కానీ ఈ బొప్పాయి ఆకుల రసం... (బొప్పాయి పండు కాదు) కు మించినది లేదు.. అయితే దీని రుచి కొంచెం అదోరకంగా ఉంటుంది.. డైరెక్ట్ గా తీసుకోలేము... అందుకే బాధితుడికి... తాగే విధంగా తగు మోతాదులో తేనెను కలిపి ఇవ్వవచ్చు... ఒక్కొక్క చెంచా.. ఒక్కొక్క చెంచా.. ఎన్ని ఎక్కువ సార్లు.. తీసుకోగలిగితే.. అంత త్వరగా కోలుకుంటాడు...

ప్లేట్ లెట్ లు కోసం చాలా రకాల పండ్లు ఉంటాయి.. కానీ వాటన్నిటికీ రారాజు.. బొప్పాయి ఆకుల రసం.. ఇది తప్ప నేను వేరే ఏది కూడా సజెస్ట్ చేయడం లేదు.. ఎందుకంటే.. ఇది పేదవాడికి కూడా పైసా ఖర్చు లేకుండా.. ఎవరి ఇంట్లో పెరడులో ఉన్న మొక్క నుండి లేత ఆకు తీసుకుని.. శుభ్రంచేసుకుని.. జ్యూస్ లా చేసుకొని.. తగు మోతాదులో అంటే రుచికి తగిన తేనె కలిపి వాడుకోండి...

డెంగ్యూ బారిన పడి 2009-12 లో ఎక్కువ మరణాలు సంభవించినపుడు.. మన ఆయుర్వేద వైద్యులే బొప్పాయి ఆకులతో వైద్యంచేసి రోగులను ఇబ్బంది బారి నుండి కాపాడింది.. ఏ ఇంగ్లీషు మందులు కూడా అప్పుడు లోపాన్ని సరి చేయలేదు... కానీ.. ఇప్పుడు బొప్పాయి ఆకుల పదార్థం నుండి వచ్చిన ఎన్నో సప్లిమెంట్స్ రూపంలో టాబ్లెట్స్ రూపంలో ఇస్తున్నారు.. ఇంగ్లీష్ మెడిసిన్ పనికిరాని ప్రతి సారి మన ఆయుర్వేద వైద్యులు ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉన్నారు.. ఈ బొప్పాయి ఆకుల రసం డెంగ్యూకు ప్రత్యామ్నాయం అనేది వారు ఇచ్చిన వరమే...

నమో భారతీయ ఆయుర్వేదః.. నమో నమః...

క్రింద ఒక ఆయుర్వేద పుస్తకము ఇస్తున్నాము... ఇందులో మన ఇంట్లో దొరికే ఎన్నో రకాల దినుసుల నుండి ఏ ఏ వ్యాధులకు ఉపయోగించవచ్చో.. ఇస్తున్నాము... తప్పక ఉపయోగ పడే పుస్తకము... డౌన్ లోడ్ చేసుకోండి.. మీ మిత్రులకు షేర్ చేయండి

గృహ వైద్యం book in telugu free download
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.



Post a Comment

Whatsapp Button works on Mobile Device only